bsnl: బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్

  • రూ.491తో రోజూ 20జీబీ డేటా
  • నెల రోజుల వ్యాలిడిటీ
  • ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్

బీఎస్ఎన్ఎల్ రూ.491 తో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. నెల రోజుల వ్యాలిడిటీతో వుండే ఈ ప్లాన్ లో ప్రతి రోజూ 20 జీబీ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే, ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ కు అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ ఎన్ కే మెహతా ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఇది వ్యక్తులకు, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు, ఫ్రాంచైజీలు, రిటైలర్ల దగ్గర నుంచి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఒకవైపు జియో బ్రాడ్ బ్యాండ్ సేవలతో తీవ్ర స్థాయిలో పోటీనిచ్చేందుకు సిద్ధం అవుతుండడంతో బీఎస్ఎన్ఎల్ ముందుగానే ఈ ప్లాన్ ను తీసుకురావడం గమనార్హం.

More Telugu News