Reliance: కాసేపట్లో బిగ్ ఎనౌన్స్ మెంట్... ఏజీఎంలో మాట్లాడేందుకు వచ్చిన ముఖేష్ అంబానీ!

  • నేడు రిలయన్స్ 41వ ఏజీఎం
  • బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లోకి రానున్న రిలయన్స్
  • స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించే అవకాశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం మరికాసేపట్లో ముంబైలోని బిర్లా మాతృశ్రీ సభాగర్ లో జరగనుండగా, ఇన్వెస్టర్లను ఉద్దేశించి సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించే విషయమై కీలక ప్రకటన ఆయన నోటి నుంచి వెలువడుతుందని తెలుస్తోంది.

గత రెండు మూడేళ్లుగా వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ముఖేష్ నోటి వెంట కీలక ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆయన ఇదే సమావేశంలో జియో గురించి చెప్పారు. గత సంవత్సరం ఉచిత జియో ఫీచర్ ఫోన్ ను ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సంవత్సరం ఆయన ఏం చెబుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.

More Telugu News