New Delhi: ఢిల్లీ సామూహిక మరణాల కేసు.. ఆ ఇంటికి 11 పైపులు ఎందుకు పెట్టినట్టు?

  • ఢిల్లీలో భాటియా ఇంటి గేటుకు 11 ఊచలు
  • పైపుల్లో ఏడు వంపు తిరిగినవి
  • నాలుగు నిటారు పైపులు 
ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద మరణాల వెనుక ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ ఇంటి గోడల నుంచి 11 పైపులు బయటకు వచ్చినట్టు గుర్తించగా, ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రధాన గేటుకు కూడా 11 ఊచలు పెట్టినట్టు తాజాగా వెలుగు చూసింది. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మతపరమైన నమ్మకాలతో చేసుకున్న ఆత్మహత్యలుగా ఈ మరణాలను పోలీసులు భావిస్తుంటే, వారి సమీప బంధువులు మాత్రం వీరితో ఏకీభవించడం లేదు. అయితే, 11 పైపులు ఎందుకు పెట్టారన్నదానికి... ఒక్కొక్కరి ఆత్మ ఒక్కో పైపు నుంచి బయటకు వెళ్లేందుకేనని స్థానికులు కొందరు పేర్కొంటున్నారు. 11 పైపుల్లో నాలుగు నిటారుగా ఉండగా, ఏడు వంపు తిరిగి ఉన్నాయి. అయితే, ఆత్మహత్య చేసుకున్న వారిలో నలుగురు మగవారు కాగా, మిగిలిన ఏడుగురు మహిళలు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో మతపరమైన నమ్మకాల కోణంలో ఈ కేసుపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారు.
New Delhi
suicides

More Telugu News