Telugudesam: ఆంధ్రాలో హోటళ్లు లేవని చెప్పి ఢిల్లీ లో భోజనం చేసేందుకు వెళ్లారా?: ఎంపీ మురళీమోహన్

  • ఎవరి చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు
  • బీజేపీ-వైసీపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
  • చంద్రబాబును ఒంటరిని చేయాలని చూస్తున్నారు
నిన్న ఢిల్లీలో వైసీపీ, బీజేపీ నేతలు కలవడంపై టీడీపీ విమర్శలు ఎక్కుబెడుతున్న విషయం తెలిసిందే. హోటల్ కు వెళ్లి భోజనం చేస్తే కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ఈ విషయమై సమర్థించుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ స్పందిస్తూ,
ఆంధ్రాలో హోటళ్లు లేవని ఢిల్లీ వెళ్లి శాంగ్రిల్లా హోటల్ లో భోజనం చేస్తున్నారా? ఎవరి చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు? అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. బీజేపీ-వైసీపీ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబును ఒంటరిని చేయాలని చూస్తున్న వారు ఓ విషయాన్ని గమనించాలని, బాబు వైపే ప్రజలు ఉన్నారని గుర్తుంచుకోవాలని అన్నారు.

‘ఇకపై మీ ఆటలు సాగవని, పోరాటం అంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తామని మురళీమోహన్ హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడతామని టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప అన్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీవి కుమ్మక్కు రాజకీయాలని మండిపడ్డారు.
Telugudesam
murali mohan
YSRCP
bjp

More Telugu News