Hyderabad: టాలీవుడ్ హీరోలు vs తెలంగాణ పోలీసులు... నేటి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రవేశం ఉచితం...!

  • పోలీస్ క్రికెట్ లీగ్ లో గెలిచిన జట్టుతో తలపడనున్న టాలీవుడ్ టీమ్
  • సెలబ్రిటీల జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులు
  • క్రీడాభిమానులు తరలి రావాలన్న సీపీ అంజనీ కుమార్
  • ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటల నుంచి మ్యాచ్

తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జరిగిన హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్ లో గెలిచిన జట్టు, నేడు టాలీవుడ్ నటులతో కూడిన జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడనుంది. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో 5.3గంటల నుంచి జరిగే మ్యాచ్ ని చూసేందుకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు తరలి రావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని చెప్పారు. ఇటీవలి కాలంలో తాము 4,050 మంది ఆటగాళ్లతో కూడిన 270 జట్ల మధ్య పోటీలు నిర్వహించామని అంజనీ కుమార్ చెప్పారు. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు పెద్దఎత్తున నగరవాసులు రావాలని కోరారు.

  • Loading...

More Telugu News