Karnataka: కర్ణాటక కొత్త సీఎంకు ప్రధాని మోదీ ఫోన్.. అభినందనలు!

  • కుమారస్వామిగౌడకు ఫోన్ చేసిన మోదీ
  • కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందించిన వైనం
  • కర్ణాటకకి కేంద్రం మద్దతు అన్నివేళలా ఉంటుంది
కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామిగౌడను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈరోజు సాయంత్రం కుమారస్వామిగౌడకు మోదీ ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని, కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివేళలా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరను కూడా మోదీ అభినందించారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వారిని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వం పాలనలో కర్ణాటక రాష్ట్రం పురోగమన దిశగా వెళ్లాలని, శాంతి, అభివృద్ధి, సంక్షేమం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Karnataka
kumara swamy gowda
pm modi

More Telugu News