airasia: రూ.999కే టికెట్లను ఆఫర్ చేస్తున్న ఎయిర్ఏషియా

  • ఎంపిక చేసిన ప్రాంతాలు, రూట్లకే పరిమితం
  • మిగిలిన రూట్లలోనూ తక్కువ ధరలకు టికెట్లు
  • ఈ నెల 27వరకు అమల్లో ఉండనున్న ఆఫర్లు 

విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఎంపిక చేసిన రూట్లలో రూ.999కే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 13 వరకు ప్రయాణించాలనుకునే వారు ఈ తగ్గింపు ధరలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ వరకు టికెట్లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎయిర్ ఏషియా వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వెళ్లే వారికి డిస్కౌంట్లు వర్తిస్తాయి. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ కు ఒకవైపు ప్రయాణానికి రూ.999గా నిర్ణయించింది. అదే విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ కు వెళ్లాలంటే టికెట్ ధర రూ.1,999గా ఉంది. హైదరాబాద్ నుంచి అయితే రూ.4,999. ఇలా ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి అనే దాని ప్రకారం రేట్లు మారిపోతాయి.

airasia
discount sale
  • Loading...

More Telugu News