SAMSUNG INFINITY DISPLAY: శామ్ సంగ్ నుంచి ఈ నెల్లోనే బడ్జెట్ ధరలో బెజెల్ లెస్ ఫోన్లు

  • జె సిరీస్ ఫోన్ల ధరలు రూ.15,000-20,000 మధ్య
  • ఎ6, ఎ6+ ఫోన్ల ధరలు రూ.20,000 పైన
  • పరిశ్రమ వర్గాల వెల్లడి

శామ్ సంగ్ బడ్జెట్ ధరలో బెజెల్ లెస్ డిస్ ప్లేతో కూడిన మొబైల్స్ ను ఈ నెలలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. గెలాక్సీ ఎ సిరీస్, గెలాక్సీ జె సిరీస్ లో వీటిని తీసుకురానుంది. గెలాక్సీ ఎ6, గెలాక్సీ ఎ6+ మోడళ్ల ధరలు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు ఉంటాయని అంచనా. గెలాక్సీ జె సిరీస్ ఫోన్ల ధరలు రూ.15,000 నుంచి 20,000 మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు ఫోన్లలో రెండు ఫోన్లలో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. వీటిని నోయిడా కేంద్రంలో తయారు చేయనుంది.

సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లేతో ఇవి వుంటాయి. ఇటీవల ఫుల్ స్క్రీన్ మొబైల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి శామ్ సంగ్ గెలాక్సీ 8, గెలాక్సీ 9 సిరీస్ ఫోన్లు ఇన్ఫినిటీ డిస్ ప్లేతో కూడినవే. కాకపోతే వీటి ధరలు రూ.40,000 పైమాటే. ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే మొబైల్స్ హవా నడుస్తుండడంతో శామ్ సంగ్ సైతం తక్కువ ధరలతో మోడళ్ల విడుదల ద్వారా మార్కెట్ వాటాపై కన్నేసింది.

More Telugu News