Sridevi: తదుపరి పెళ్లి పీటలు ఎక్కేది నువ్వే... శ్రీదేవి కూతురు జాహ్నవిని ఆటపట్టించిన సోనమ్ కపూర్!

  • 'కలేరి'ని జాహ్నవికి తాకించాలని చూసిన సోనమ్
  • అదే జరిగితే సిక్కు సంప్రదాయంలో తదుపరి వివాహం జాహ్నవిదే
  • వైరల్ అవుతున్న వీడియో
నేడు ఆనంద్ అహూజాతో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ వివాహం వైభవంగా జరగనుండగా, సోనమ్ మెహందీ ఫంక్షన్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ వేడుకకు శ్రీదేవి కుమార్తెలు జాహ్నవి, ఖుషి కూడా హాజరుకాగా, సిక్కుల సంప్రదాయ 'కలేరి'ని జాహ్నవికి తాకించేందుకు చూసిన సోనమ్, ఆమెను ఆటపట్టించింది.

సిక్కుల సంప్రదాయంలో పెళ్లి కూతురు ఛుదా (ఎర్రని గాజులు) ధరించి, గాజులతో పాటు కలేరి (చెవులకు వేసుకున్న బుట్టీల వంటివే పెద్దవి) ధరిస్తుంది. ఆపై ఆమె వాటిని ఏ అమ్మాయి తలకు తాకిస్తుందో, ఆ అమ్మాయి పెళ్లే వారింట జరిగే తొలి శుభకార్యం అవుతుందని సిక్కుల విశ్వాసం. ఇక కలేరీతో బయలుదేరిన సోనమ్ కపూర్, కపూర్ల ఇంట తరువాతి పెళ్లి జాహ్నవిదే అనే సంకేతాలిస్తూ, ఆమె తలను తాకించేందుకు బయలుదేరింది.

 చివరకు తాకించలేదుగానీ, 'సారీ జానూ' అంటూ వదిలేసింది. ఆపై కుర్చీలో నుంచి లేచిన జాహ్నవి, 'హమ్మయ్య' అనుకుంటూ తాను తప్పించుకున్నానన్న ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా, ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
Sridevi
Sonam Kapoor
Anil Kapoor
Marriage
Jahnavi Kapoor

More Telugu News