kcr: సివిల్స్ టాపర్ అనుదీప్ ను లంచ్ కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్

  • ఈరోజు లంచ్ కు రావాలంటూ అనుదీప్ కు ఆహ్వానం
  • ప్రగతిభవన్ లో లంచ్ కు హాజరుకానున్న అనుదీప్  
  • సివిల్స్ విజేతకు పలువురి అభినందనలు
సివిల్ సర్వీసెస్ 2017 ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించి, టాపర్ గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ ను సీఎం కేసీఆర్ లంచ్ కు ఆహ్వానించారు.ఈరోజు ప్రగతిభవన్ లో లంచ్ కు రావాల్సిందిగా అనుదీప్ కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో అనుదీప్ తన కుటుంబసభ్యులతో కలసి లంచ్ కు వెళ్లనున్నారు. కాగా, సివిల్ సర్వీసెస్ - 2013లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కి అనుదీప్ ఎంపికయ్యారు. హైదరాబాద్ లో పోస్టింగ్ పొందారు. సివిల్స్ టాపర్ అనుదీప్ ను ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందించారు. 
kcr
civils topper anudeep

More Telugu News