sidda ramaiah: ప్రచార సభలో నిద్రపోయిన సిద్ధరామయ్య.. లేపితే లేచి మళ్లీ నిద్రలోకి జారుకున్న వైనం

  • ఇప్పటికే సభల్లో చాలాసార్లు నిద్రపోతూ కనపడ్డ సిద్ధరామయ్య
  • మరోసారి బయటకు వచ్చిన వీడియో
  • సెటైర్లు వేస్తోన్న నెటిజన్లు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే చాలాసార్లు పలు సభల్లో నిద్రపోతూ కనపడి విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన గుల్బర్గాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని సభలో కూర్చుని మరోసారి హాయిగా నిద్రపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన పక్కనున్న ఓ నేత సిద్ధరామయ్యను లేపారు. కానీ, సిద్ధరామయ్య మళ్లీ అంతలోనే నిద్రలోకి జారుకోవడం నవ్వులు పూయిస్తోంది.

ఆయన నిద్రపోతున్నప్పటి వీడియో మరోసారి బయటకు రావడంతో నెటిజన్లు మరోసారి జోకులు వేసుకుంటున్నారు. సభ జరిగేటప్పుడు నిద్రనుంచి మేల్కోవడానికి సిద్ధరామయ్య చాలా ఇబ్బంది పడతారని అంటున్నారు. ఆయన కర్ణాటకలో ఐదేళ్లుగా ఇదే పని చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 
sidda ramaiah
Karnataka
elections
sleeping

More Telugu News