banerje: సీనియర్ నటుడు, బెనర్జీ తండ్రి రాఘవయ్య మృతి

  • అనారోగ్యంతో రాఘవయ్య (86) మృతి
  • ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు
  • టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటుడు రాఘవయ్య (86) మృతి చెందారు. సినీ నటుడు బెనర్జీకి రాఘవయ్య తండ్రి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ లోని వారి స్వగృహంలో ఉంచారు. ఈరోజు 'మహాప్రస్థానం'లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

 రాఘవయ్య మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు. కాగా, టాలీవుడ్ లో పలువురు సీనియర్ నటులతో కలిసి ఆయన పనిచేశారు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల మొదలైన సినిమాల్లో నటించి ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
banerje
s/o raghavaiah
artists

More Telugu News