siddarth: విలన్ గా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్

  • 'బాయ్స్'తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్
  • 'రంగ్ దే బసంతి' సినిమాతో బాలీవుడ్ ప్రవేశం 
  • ‘కమ్మర సంభవం’ సినిమాతో మలయాళంలో ఎంట్రీ

ప్రముఖ సినీ నటుడు సిద్ధార్థ్ మలయాళ సినీ పరిశ్రమకు విలన్ గా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాతో లీడింగ్ రోల్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్ లకు పరిచయమైన సిద్ధార్థ్.. 'రంగ్ దే బసంతి'తో బాలీవుడ్ లో కూడా గుర్తింపు పొందాడు. ఈ మధ్యే ఆయన నటించిన హారర్ ధ్రిల్లర్ ‘గృహం’ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు సిద్ధార్థ్ మలయాళ చిత్రపరిశ్రమపై కన్నేశాడు. ‘కమ్మర సంభవం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో దిలీప్ క్యారెక్టర్ కు దీటుగా విలన్ క్యారెక్టర్ ఉంటుందని, అందుకే ప్రతినాయకుడి పాత్రలో నటించేందుకు సిద్దూ అంగీకరించాడని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

siddarth
Tollywood
kollywood
mollywood
Bollywood
  • Loading...

More Telugu News