ipl: ఇంకా ప్రారంభం కాకుండానే.. ఐపీఎల్ విజేతను ప్రకటించిన జ్యోతిష్యుడు!

  • ఐపీఎల్ విజేతను ప్రకటించిన జ్యోతిష్యుడు గ్రీన్ స్టోన్ లోబో
  • జాతక రీత్యా ధోనీ, రోహిత్ కు గెలిచే అవకాశం లేదట 
  • సన్ రైజర్స్ కు, రాజస్థాన్ రాయల్స్ లకు కెప్టెన్లు వీక్ 

ఐపీఎల్‌ సీజన్-11 ప్రారంభం కాకుండానే విజేతను ఒక జ్యోతిష్యుడు ప్రకటించాడు. గ్రీన్ స్టోన్ లోబోగా పిలిపించుకునే జ్యోతిష్యుడు.. ఐపీఎల్ పై తన జోస్యం చెప్పాడు. రెండేళ్ల నిషేధం తరువాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు, ఢిల్లీ డేర్ డెవిల్స్ కు అవకాశం లేదని లోబో తెలిపాడు. అనుభవజ్ఞులైన కెప్టెన్లు దూరం కావడంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు విజయావకాశాలు తక్కువని తేల్చి చెప్పాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ వీక్ గా కనిపిస్తుండడంతో ఆ జట్టుకు, రోహిత్ శర్మ జాతక రీత్యా ముంబై ఇండియన్స్ జట్టుకు ట్రోఫీ గెల్చుకోవడం కష్టమని చెప్పాడు. ఇక ఈ ఏటి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లలో ఏదో ఒకటి నిలుస్తుందని గ్రీన్ స్టోన్ లోబో తెలిపాడు. జాతక రీత్యా, జట్టు కూర్పు రీత్యా విరాట్‌ కోహ్లీ లేదా రవిచంద్రన్‌ అశ్విన్‌ లలో ఒకరు ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంటారని అన్నాడు. కాగా, పదేళ్ల క్రికెట్ సీజన్ లో ఈ రెండు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని సాధించలేదు.

More Telugu News