airasia: రూ.849కే ప్రయాణించండి... ఎయిర్ ఏషియా ఎయిర్ లైన్స్ ఆఫర్

  • ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ఈ ధరకు అందుబాటు
  • ఒకవైపు ప్రయాణానికే తగ్గింపు ధరలు వర్తిస్తాయి
  • కొన్ని మార్గాల్లో రూ.1,099, రూ.1,499 ధరలు

ఎయిర్ ఏషియా సంస్థ భారీ తగ్గింపు ధరలతో ఆపర్లను ప్రకటించింది. కేవలం రూ.849తో దేశీయంగా ప్రయాణ టికెట్టును బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, అంతర్జాతీయ రూట్లలో రూ.1,999కే టికెట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు టికెట్లను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మే 28లోపు ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ తగ్గింపు ఒకవైపు ప్రయాణానికే లభిస్తుంది. ఉదాహరణకు రాను, పోను టికెట్లను తగ్గింపు ధరపై బుక్ చేసుకోవడానికి అనుమతించదు. కేవలం ఒకవైపు ప్రయాణానికే తక్కువ ధరకు టికెట్ లభిస్తుంది. దేశీయంగా కొన్ని మార్గాల్లో టికెట్లపై రూ.1,099, రూ.1,499, రూ1,999కూడా ఈ సంస్థ వసూలు చేస్తోంది. రూ.849 ధర కేవలం ఎంపిక చేసిన కొన్ని మార్గాలకే పరిమితం.

airasia
airlines
discount fares
  • Loading...

More Telugu News