Sridevi: నర్మదా నదిలో శ్రీదేవికి వీరాభిమాని తర్పణం..!

  • శ్రీదేవిపై అభిమానంతో వీరాభిమాని శిరోముండనం
  • అన్నదానం కూడా చేసిన వైనం
  • అభిమాన నటి ఆత్మశాంతి కోసం తర్పణం వదిలిన వీరాభిమాని

మధ్యప్రదేశ్‌లో వెల్లుల్లి వ్యాపారం చేసే ఓ యువకుడు తాను అమితంగా ఆరాధించే నటి శ్రీదేవికి తర్పణం విడిచాడు. ఆమె చనిపోయిన తర్వాత పదో రోజు శిరోముండనం చేయించుకోవడమే కాక అన్నదానం కూడా చేశాడు. ఆ వీరాభిమాని పేరు అమ్జాద్. తాను ధామ్‌నోడ్‌లో ఉంటానని, శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని అతను మీడియాతో చెప్పుకొచ్చాడు.

ఆమె అకాలమరణం తననెంతో బాధించిందని అతను అన్నాడు. అందుకే నర్మదా నదిలో శ్రీదేవికి తర్పణం విడిచానని అతను తెలిపాడు. ఇక్కడ తర్పణాలు విడిస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని తెలిసి ఇక్కడకు వచ్చానని అతను చెప్పాడు. నర్మదా నదీ తీరంలో ఇలా అతను శ్రీదేవి చిత్ర పటం పెట్టుకుని సంప్రదాయబద్ధంగా తర్పణం వదులుతుంటే అటుగా వెళ్లేవారు ఆశ్చర్యంగా చూశారు.

  • Loading...

More Telugu News