maa: సోషల్ మీడియా అత్యుత్సాహం... వంకాయల సత్యనారాయణ మరణిస్తే... కైకాల సత్యనారాయణ అన్నారు!

  • శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతిచెందిన వంకాయల  
  • సోషల్ మీడియాలో కైకాల సత్యనారాయణగా రూమర్లు  
  • మృతి చెందింది వంకాయల అని వివరణ ఇచ్చిన 'మా'

సోషల్‌ మీడియాలో కొంత మంది అత్యుత్సాహం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రకటన విడుదల చేసేంతవరకు వెళ్లింది. దాని వివరాల్లోకి వెళ్తే... సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ శ్వాసకోస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. వంకాయల సత్యనారాయణ ఎవరో తెలియని కొంత మంది సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు బదులుగా దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సందేశాలు పోస్టు చేశారు. దీంతో పలువురు వాటిని షేర్ చేసుకుని, సంతాపం తెలిపారు. ఇది 'మా' వరకు వెళ్లడంతో వెంటనే స్పందించింది. కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగా ఉన్నారని, మృతిచెందింది వంకాయల సత్యనారాయణ అని 'మా' స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

maa
movie artists assosiation
vankayala satyanarayana
kaikala satyanarayana
  • Loading...

More Telugu News