Virat Kohli: కోహ్లీకి శుక్ర మహర్థశ నడుస్తోంది... రికార్డులు, రివార్డులు కోహ్లీవే: క్రికెట్ జోతిష్యుడు

  • కోహ్లీ జాతకం చూసిన నాగపూర్ జ్యోతిష్యుడు నరేంద్ర బుందే
  • వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ కోహ్లీ సేన సొంతం చేసుకుంటుంది
  • క్రికెట్ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని కోహ్లీ చేసుకుంటాడు
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జాతకంలో శుక్రమహర్దశ నడుస్తోందని, దీంతో క్రికెట్ లో కోహ్లీ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాడని ప్రముఖ క్రికెట్ జ్యోతిష్యుడు నరేంద్ర బుందే చెబుతున్నారు. నాగ్ పూర్ కి చెందిన నరేంద్ర బుందే క్రికెట్ సర్కిల్ లో ప్రముఖ జ్యోతిష్యుడు. గతంలో ఆయన వద్దకు సౌరవ్, మురళీ కార్తీక్‌, శ్రీశాంత్‌, జహీర్‌, గంభీర్‌, రైనా, ప్రీతి జింటా తదితరులు సలహాలు తీసుకున్నారు. టీ20, వన్డే వరల్డ్ కప్ లను కోహ్లీ అందుకుంటాడని ఆయన తెలిపారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీల రికార్డును కూడా కోహ్లీ అధిగమిస్తాడని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చేసుకుంటాడని ఆయన చెబుతున్నారు. గతంలో తాను చెప్పినవన్నీ నిజమయ్యాయని, ఇది కూడా నిజమవుతుందని ఆయన భరోసా ఇస్తున్నారు. కాగా, టెండూల్కర్, ధోనీ విషయాల్లో ఆయన చెప్పినవి జరగడంతో టీమిండియా, కోహ్లీ అభిమానులు సంబరపడిపోతున్నారు.
Virat Kohli
Cricket
team india
astrology

More Telugu News