bowler shami: క్రికెటర్ షమీ కేసులో సమాచారం కోసం బీసీసీఐని సంప్రదించిన పోలీసులు

  • షమీ దక్షిణాఫ్రికా పర్యటన మార్గం తెలియజేయాలని లేఖ
  • ఆ టూర్ తర్వాత దుబాయి వెళ్లి పాకిస్థానీ యువతిని కలిసినట్టు ఆరోపణలు
  • షమీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు

భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కేసులో కోల్ కతా పోలీసులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను సంప్రదించారు. షమీ భార్య హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని, తనను శారీరకంగా, మానసికంగా వేధించినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా టూర్ తర్వాత షమీ దుబాయి వెళ్లి పాకిస్థానీ యువతిని కలిసినట్టు జహాన్ ఆరోపణ. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షమీ దక్షిణాఫ్రికా టూర్ కు సంబంధించిన మార్గంపై సమాచారం ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాశారు.

  • Loading...

More Telugu News