martyrs memorial: తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత రూపం... హుస్సేన్ సాగర్ సమీపంలో అద్భుత స్మారక చిహ్నం!

  • హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు
  • డిజైన్ కు సీఎం ఆమోదం
  • ట్విట్టర్ లో కేటీఆర్ వెల్లడి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వారి గుర్తుగా ఏర్పాటు చేయనున్న స్మారక చిహ్నంకు సంబంధించిన అద్భుతమైన డిజైన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులైన వందలాది మంది త్యాగాలను శాశ్వతీకరించే మార్టిర్స్ మెమోరియల్ డిజైన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ వద్ద ఇది ఏర్పాటు కానుంది’’ అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. సిల్వర్ రంగులో ఉన్న పెద్ద సైజు ప్రమిద, అందులోంచి బంగారు వర్ణంలో ఎగసిపడుతున్న జ్యోతితో ఈ డిజైన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News