అమేజాన్ లో వివో కార్నివాల్... వేలంటైన్స్ డే సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమేజాన్ లో వివో కార్నివాల్... వేలంటైన్స్ డే సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లు

  • వి7+ స్పెషల్ ఎడిషన్ ధర రూ.22,900
  • ఉచిత మూవీ టికెట్లు
  • అన్ని మోడళ్లపై డిస్కౌంట్లు, ఎక్సేంజ్ ఆఫర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమేజాన్ డాట్ ఇన్ ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) ఆగమనం సందర్భంగా వివో ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లతో వివో కార్నివాల్ నిర్వహిస్తోంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఈ కార్నివాల్ కొసాగుతుంది. ఇందులో భాగంగా తగ్గింపు ధరలు, ఎక్సేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఉన్నాయి. వివో లిమిటెడ్ ఎడిషన్ అయిన వి7+ హ్యాండ్ సెట్ ధర రూ.22,900. ఈ హ్యాండ్ సెట్ రెడ్ కలర్ లో ఉంటుంది.

వీటితో పాటు రూ.500 విలువైన ఫెర్న్స్ అండ్ పెటల్స్ వోచర్, బుక్ మై షోలో రూ.500 విలువకు సమానమైన మూవీ టికెట్లు ఆఫర్ చేస్తోంది. అలాగే ఎక్చేంజ్ కింద 18,752 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ హ్యాండ్ సెట్ 5.99 అంగుళాల ఫుల్ హెడ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. 24 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 16 మెగా పిక్సల్స్ కెమెరా ఉన్నాయి. ఇక వివో వి7+ రెగ్యులర్ వెర్షన్ ధర రూ.21,999. దీనిపై ఎటువంటి తగ్గింపు లేదు. ఎక్చేంజ్ పై రూ.2,000 వరకే తగ్గింపునిస్తోంది.

ఇక వివో వి7 ధర రూ.18,990 కాగా, తగ్గింపు కింద రూ.16,990కే అందిస్తోంది. ఎక్చేంజ్ కింద మరో రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. వి5 ప్లస్ పై రూ.6,000 తగ్గింపుతో రూ.19,990కే ఆఫర్ చేస్తోంది. వి5ఎస్ ను రూ.3,000 తగ్గింపుతో రూ.15,990కు అందిస్తోంది. వివో వై69, వివో వై66 హ్యాండ్ సెట్ లపై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ మోడళ్లు వై55ఎస్ ను తగ్గింపు తర్వాత రూ.10,990కు, వై53ని రూ.8,990కు సొంతం చేసుకోవచ్చు.
vivo smart phones

More Telugu News