స్క్రీన్ మీదే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌.. వివో కొత్త ఫోన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్క్రీన్ మీదే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌.. వివో కొత్త ఫోన్!

  • త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న సంస్థ‌
  • ఈ టెక్నాల‌జీతో వ‌స్తున్న మొద‌టి స్మార్ట్‌ఫోన్ ఇదే!
  • ధ‌ర రూ. 36,770
ఇప్ప‌టివ‌రకు వ‌చ్చిన స్మార్ట్‌ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ వెన‌క‌వైపున గానీ, హోం బ‌ట‌న్ వ‌ద్ద గానీ ఉండేది. కానీ మొద‌టిసారిగా స్క్రీన్ మీదే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌తో కొత్త మొబైల్‌ను చైనా కంపెనీ వివో త్వ‌ర‌లో విడుద‌ల‌ చేయ‌బోతోంది. వివో ఎక్స్ 20 ప్ల‌స్ యూడీ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధ‌ర రూ. 36,770గా ఉండ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

ఇక స్పెసిఫికేష‌న్ల విష‌యానికి వ‌స్తే.. 18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న 6.43 ఇంచ్ భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3905 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
display
fingerprint
vivo
smartphone

More Telugu News