Elephants: వామ్మో! వైజాగ్ జూ ఏనుగులు... రోజుకు ఎంత తింటాయో తెలిస్తే అవాక్కే!

  • రోజుకు దాదాపు టన్ను ఫుడ్డు
  • ఔరంగాబాద్ నుంచి వచ్చిన సరస్వతి, లక్ష్మి
  • సందర్శకులను అలరిస్తున్న ఏనుగులు
తల్లి ఏనుగు సరస్వతి, దానికి పుట్టిన బిడ్డ లక్ష్మి... ఈ రెండు ఏనుగులూ ఔరంగాబాద్ నుంచి విశాఖపట్నం జూకు ఇటీవలే వచ్చాయి. ఇక్కడి మావటిలకు అలవాటు పడుతున్నాయి. సరస్వతి చెప్పినట్టు వింటుండగా, లక్ష్మి మాత్రం కాస్తంత మారాం చేస్తోంది. ఇక ఇవి రోజుకు ఎంత ఆహారాన్ని తీసుకుంటాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

రోజుకు ఈ తల్లీ కూతుళ్లు కలసి 650 కిలోల పచ్చగడ్డి, 20 కిలోల కేటిల్ ఫీడ్, పది కిలోల రాగితోఫ, 5 కిలోల చొప్పున అన్నం బెల్లం, కొమ్ము శనగలు, పది కొబ్బరి కాయలు, 75 కిలోల చెరకు, 5 పుచ్చకాయలు, 5 అరటి గెలలు, వంద కిలోల అరటి దువ్వ, 50 కిలోల మర్రి, రావి ఆకులను లాగించేస్తున్నాయి. వీటితో పాటు మరో రెండు ఏనుగులు లక్ష్మి, కృష్ణ, రాజా కూడా విశాఖ జూలో సందర్శకులను అలరిస్తున్నాయి.
Elephants
Vizag
Zoo
Food

More Telugu News