mrps: జాతీయ ర‌హ‌దారిపై ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌!

  • జైల్లో ఉన్న మంద కృష్ణ మాదిగను విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌
  • వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  • నిర‌స‌న‌ను విర‌మింపజేసిన పోలీసులు

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ర్యాలీ జ‌రిపి, తన కార్యకర్తలను రెచ్చగొట్టారన్న కారణంపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను జ్యుడీషియల్ రిమాండుకు పంపిన విష‌యం తెలిసిందే. ఇందుకు నిర‌స‌న‌గా భ‌వ‌న‌గిరి యాదాద్రి జిల్లాలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

మంద కృష్ణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో యాదాద్రి జిల్లాలో వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ నిర‌స‌న గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను శాంతింప‌జేసి, వెన‌క్కి పంపించేశారు.
 

  • Loading...

More Telugu News