Karthik: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన సంధ్యారాణి... చివరి మాటల వీడియో చూడండి!

  • అంబులెన్స్ లో చివరి మాటలు
  • కార్తీక్ పెట్రోలు పోసి నిప్పంటించాడు
  • బైక్ పై ఒక్కడే వచ్చాడన్న సంధ్యారాణి
నిన్న ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన సంధ్యారాణిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న వేళ, మాట్లాడింది. తనపై పెట్రోలు పోసి నిప్పంటించింది కార్తీక్ అని, అతని చెల్లెలు నదియా తనతో కలిసి పనిచేస్తుంటుందని పేర్కొంది. తామిద్దరమూ తార్నాక బిగ్ బజార్ లో పని చేస్తుంటామని తెలిపింది. తనకు నిప్పంటించే ముందు కార్తీక్ కాసేపు మాట్లాడాడని, బండిపై ఒక్కడే వచ్చాడని చెప్పింది. తనపై కార్తీక్ పెట్రోలు పోసి నిప్పంటించాడని స్పష్టంగా పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చివరి మాటల వీడియోను మీరూ చూడవచ్చు.


Karthik
Sandhyarani
Ambulence
Attack

More Telugu News