ookla: మొబైల్ ఇంట‌ర్నెట్ వేగంలో భార‌త్ ర్యాంకు 109... వెల్ల‌డించిన‌ ఊక్లా గ్లోబ‌ల్ ఇండెక్స్‌

  • పాకిస్థాన్, నేపాల్‌, శ్రీలంక‌ల కంటే త‌క్కువ ర్యాంకు
  • దేశంలో స‌రాస‌రి మొబైల్ ఇంట‌ర్నెట్ వేగం 7.65 ఎంబీపీఎస్‌
  • ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో 76వ‌ స్థానం

అంత‌ర్జాతీయంగా పోల్చిన‌పుడు మొబైల్ ఇంట‌ర్నెట్ వేగంలో భార‌త‌దేశం చాలా త‌క్కువ ర్యాంకులో ఉంది. ఇంట‌ర్నెట్ స్పీడ్ టెస్టింగ్ వెబ్‌సైట్ ఊక్లా ప్ర‌కారం మొబైల్ ఇంట‌ర్నెట్ వేగంలో భార‌త‌దేశం 109వ స్థానంలో నిలిచింది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో మాత్రం 76వ స్థానంలో ఉంది. 2017 ప్రారంభంలో దేశంలో స‌రాస‌రి మొబైల్ డౌన్‌లోడ్ వేగం 7.65 ఎంబీపీఎస్ ఉండేది. చివ‌రికి వ‌చ్చే స‌రికి ఈ వేగం 8.80 ఎంబీపీఎస్‌కి చేరుకుందని ఊక్లా తెలిపింది.

కానీ మొబైల్ ఇంట‌ర్నెట్ వేగం విష‌యానికి వ‌చ్చేస‌రికి పాకిస్థాన్‌, నేపాల్‌, శ్రీలంక‌ల కంటే త‌క్కువ ర్యాంకులో భార‌త్ నిలిచింది. ఇక ఫిక్స్‌డ్ ఇంట‌ర్నెట్ వేగం 12.12 ఎంబీపీఎస్ నుంచి 18.82 ఎంబీపీఎస్ కి పెరిగింది. దేశంలో ఇంట‌ర్నెట్ వేగం రోజురోజుకీ పెరుగుతోందని ఊక్లా వెల్ల‌డించింది. ఇక ప్ర‌పంచంలో ఎక్కువ మొబైల్‌ ఇంట‌ర్నెట్ వేగాన్ని అంద‌జేస్తున్న దేశంగా నార్వే నిలిచింది. ఇక్క‌డ స‌రాస‌రి మొబైల్ ఇంట‌ర్నెట్ వేగం 62.66 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగంలో 153.85 ఎంబీపీఎస్ వేగం అందిస్తూ సింగ‌పూర్ మొద‌టిస్థానంలో నిలిచింది.

More Telugu News