poonam kaur: ఒబామాకు పూనమ్ కౌర్ ప్రత్యేక బహుమతి

  • ఒబామాను కలిసిన పూనమ్ కౌర్
  • ఢిల్లీలో జరిగిన కార్యక్రమం సందర్భంగా కలయిక
  • చేనేత వస్త్రాలు బహుమతిగా అందజేత
ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసింది. భారత పర్యటనలో భాగంగా ఒబామా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను కలిసిన పూనమ్ కౌర్ చేనేత వస్త్రాలను బహుమతిగా అందజేసింది.

ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. "నా జీవితంలో అంత్యంత విలువైన క్షణాలు గడిపాను. నేనెవరికి గౌరవం ఇస్తానో, నేనెవరిని చూసి స్ఫూర్తి పొందుతానో ఆ వ్యక్తిని కలిశాను. నేను ప్రేమించే ఇద్దరు వ్యక్తులకు అందజేయమని చేనేత వస్త్రాలను ఆయనకు అందజేశాను" అని ట్వీట్ చేసింది.

కాగా, పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్‌ చేనేత ప్రచారకర్త బాధ్యతలు నిర్వర్తించనున్నారని ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
poonam kaur
barak obama
delhi

More Telugu News