cm: ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి కుటుంబం కోసం ఒక అంత‌స్తు మొత్తాన్ని ఖాళీ చేయించిన ప్ర‌భుత్వాసుప‌త్రి!

  • ప్ర‌స‌వం కోసం చేరిన ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం ర‌మ‌ణ్ సింగ్ కోడ‌లు
  • 1200 మంది పేషెంట్ల‌ను ఖాళీ చేయించిన ఆసుప‌త్రి
  • మ‌రో అంత‌స్తులో బెడ్లు లేక ఇబ్బంది ప‌డ్డ రోగులు

రాయ్‌పూర్‌లోని భీంరావ్ అంబేద్క‌ర్ మెమోరియ‌ల్ ప్రభుత్వాసుప‌త్రిలో ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్ కోడ‌లు ఐశ్వ‌ర్యాసింగ్ ప్ర‌స‌వం నిమిత్తం చేరారు. దీంతో ముఖ్య‌మంత్రి కుటుంబం కోసం ఆ అంత‌స్తులో ఉండే పేషెంట్లంద‌రినీ ఆసుప‌త్రి వ‌ర్గాలు మ‌రో అంత‌స్తుకి త‌ర‌లించాయి. దాదాపు 1200 మంది రోగులను ఖాళీ చేయించాయి.

మ‌రో అంత‌స్తులో స‌రిప‌డ ప‌డ‌క‌లు లేక‌పోవ‌డంతో ఒకే ప‌డ‌క మీద ఇద్ద‌రు పేషెంట్లను స‌ర్దుకోవాల‌ని చెప్పారు. దీంతో పేషెంట్లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. దీనిపై రాష్ట్ర‌ ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. అయితే అస‌లు ప్ర‌భుత్వాసుప‌త్రిలో ర‌మ‌ణ్ సింగ్ కోడ‌లు చేర‌డ‌మే ఆసుప‌త్రికి గొప్ప గౌర‌వ‌మ‌ని బీజేపీ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చుకున్నాయి.

  • Loading...

More Telugu News