sunny leone: వ్యాయామాలు నేర్పించేందుకు రెడీ అవుతున్న స‌న్నీ లియోన్‌

  • టీవీ షోతో త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు
  • `ఫిట్‌స్టాప్‌` పేరుతో ఎంటీవీ బీట్స్‌లో టీవీ షో
  • మంచి ఎక్స‌ర్‌సైజుల‌ను నేర్పిస్తానంటున్న బాలీవుడ్ తార‌

టీవీ వ్యాఖ్యాత‌గా ఇప్ప‌టికే ఎంటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న `స్ప్లిట్స్‌విల్లా` కార్య‌క్ర‌మానికి స‌న్నీ లియోన్ ప‌నిచేస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రో టీవీ కార్య‌క్ర‌మంతో స‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సంగీతాన్ని, ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను మేళ‌విస్తూ ఎంటీవీ బీట్స్ ఛాన‌ల్‌లో `ఫిట్‌స్టాప్‌` పేరుతో స‌న్నీ లియోన్ ఓ కార్య‌క్ర‌మం చేయ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మంచి ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం చేస్తుందట.

`మాన‌సికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్స‌ర్‌సైజ్ ఎంతో అవ‌స‌రం. ప్ర‌తి ఒక్క‌రు త‌మ రోజులో కొంత స‌మ‌యాన్ని వ్యాయామం కోసం త‌ప్ప‌కుండా వెచ్చించాలి. అందుకే ఎంటీవీతో క‌లిసి `ఫిట్‌స్టాప్‌` పేరుతో ఓ కార్య‌క్ర‌మం చేస్తున్నా. దీంట్లో అన్ని ర‌కాల వ్యాయామాల‌ను నేను ప‌రిచ‌యం చేస్తాను` అని స‌న్నీ చెప్పింది. గ‌తంలో `సూప‌ర్ హాట్ స‌న్నీ మార్నింగ్స్‌` పేరుతో స‌న్నీ లియోన్ టైమ్స్ లివింగ్ వారి యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఒక ఫిట్‌నెస్ కార్య‌క్ర‌మం చేసింది. కేవ‌లం ఆరు ఎపిసోడ్లు మాత్ర‌మే కొన‌సాగిన ఈ కార్య‌క్ర‌మంలో ఎన్నో మంచి వ్యాయామాల‌ను స‌న్నీ ప‌రిచ‌యం చేసింది.

  • Loading...

More Telugu News