పన్నీర్ సెల్వంను అడ్డుకున్న ప్రజలు!

  • తాగునీరు రావడం లేదంటూ ఆందోళన
  • నెల రోజులు గడచినా చర్యలు తీసుకోలేదంటూ మండిపాటు
  • సమస్యను పరిష్కరించాలంటూ పన్నీర్ సెల్వం ఆదేశాలు 
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రజల నిరసన సెగ తగిలింది. తేని ప్రాంతం అల్లినగరం పంచాయతీ పరిధిలో తాగునీటి పథకాలను పరిశీలించేందుకు పన్నీర్ సెల్వం వెళ్లారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం వాహనశ్రేణిని అడ్డుకున్న స్థానికులు... ఆయన కారును చుట్టుముట్టారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తిందని... నెల రోజులు గడచినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో కారు దిగిన పన్నీర్ సెల్వం ఆందోళనకారులను శాంతింపజేశారు. తాగునీటి పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో, ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
Go Back to Shorts
panner selvam
tamilnadu deputy cm

More Telugu News