Conductor And Constable fight: బస్సులో మహిళా కండక్టర్- మహిళా కానిస్టేబుల్ ఫైట్!

  • బస్సులో మహిళా కానిస్టేబుల్, కండక్టర్ ఫైట్
  • యూనిఫాంలో ఉంటే టికెట్ అక్కర్లేదన్న కానిస్టేబుల్
  • ఘర్షణగా మారిన వాగ్వాదం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ప్రయాణికుడు
  • పోలీస్ స్టేషన్ లో సెటిలైన వివాదం
ఆర్టీసీ బస్సులో టికెట్‌ పెనువివాదానికి కారణమైంది. యూనిఫాంలో ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మహిళ పోలీస్‌ కానిస్టేబుల్‌, టికెట్ తీసుకోవాల్సిందేనన్న కండక్టర్‌ వాదన.. ఘర్షణకు దారితీశాయి. దాని వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌ నగర్‌ నుంచి నవాబుపేటకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ రజితకుమారి ఎక్కారు. ఆ బస్సుకి కండక్టర్ గా పనిచేస్తున్న శోభారాణి ప్రయాణికులకు టికెట్లిస్తూ సదరు కానిస్టేబుల్ ను కూడా టికెట్ తీసుకోమని అడిగింది.

దానికి ఆమె తాను డ్యూటీలో వున్నానని చెబుతూ, తన వద్దనున్న జిరాక్స్‌ ఐడీ కార్డు చూపించారు. అయితే దానిని అనుమతించమని, ఒరిజినల్ చూపించాలని కండక్టర్ డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. కానిస్టేబుల్ ఆవేశంతో తన చేతిపవర్ రుచి చూపించగా, కండక్టర్ సీట్లో చతికిలబడిపోయింది. దీనిని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి. చివరికి ఈ కేసు పోలీస్ స్టేషన్ లో సెటిల్ అయిపోవడం విశేషం. 
Conductor And Constable fight
Conductor
Constable
social media

More Telugu News