virendra sehwag: సెహ్వాగ్ కు అతి ఖరీదైన కానుకను ఇచ్చిన టెండూల్కర్!

  • సెహ్వాగ్ కు బీఎండబ్ల్యూ కారును బహూకరించిన సచిన్
  • కారు ఖరీదు రూ. 1.14 కోట్లు
  • థాంక్యూ పాజీ అంటూ ధన్యవాదాలు తెలిపిన సెహ్వాగ్
భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. సచిన్ తో కలసి ఎన్నో ఏళ్ల పాటు సెహ్వాగ్ భారత క్రికెట్ కు సేవలందించాడు. సెహ్వాగ్ ను ఎంతగానో ఇష్టపడే సచిన్... అతనికి ఓ అద్భుతమైన కానుకను బహూకరించాడు. వీరేంద్రుడికి సచిన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే బీఎండబ్ల్యూ 730ఎల్ డీ కారు. దీని ఖరీదు రూ. 1.14 కోట్లు.

ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు సెహ్వాగ్. తనకు బహుమతిని ఇచ్చిన సచిన్ కు ధన్యవాదాలు తెలిపాడు. "థాంక్యూ సచిన్ పాజీ" అంటూ ట్వీట్ చేశాడు. ఓపెనర్లుగా వీరిద్దరూ కలసి భారత్ కు ఎన్నో ఘన విజయాలను అందించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సెహ్వాగ్ రిటైర్ అయిన సందర్భంలో.. 'సెహ్వాగ్ ఓ నిజమైన ఛాంపియన్' అంటూ సచిన్ కొనియాడాడు. సెహ్వాగ్ కూడా సచిన్ ను క్రికెట్ దేవుడిగానే భావిస్తుంటాడు. సచినే తనకు స్ఫూర్తి అంటూ సెహ్వాగ్ పలు సందర్భాల్లో చెప్పాడు.  
virendra sehwag
sachin tendulkar
team india
bmw 730ld
schin gift to sehwag

More Telugu News