Meat and Livestock Australia: ఆస్ట్రేలియాలో హిందువుల ఆందోళన.. వినాయకుడు మాంసం తింటున్నట్టు చూపడంపై ఆగ్రహం

వినాయక చవితిని, వినాయకుడిని అవమానించారని ఆరోపిస్తూ ఆస్ట్రేలియాలోని హిందువులు ఆందోళన నిర్వహించారు. వినాయకుడు మాంసం తింటున్నట్టు ‘మీట్ అండ్ లైవ్ స్టోక్ ఆస్ట్రేలియా’ (ఎంఎల్ఏ) అనే కంపెనీ తమ ప్రకటనలో చూపించింది. హిందువుల ఆగ్రహానికి ఇది కారణమైంది. హిందువులను, వినాయకుడిని తమ ప్రకటనతో ఘోరంగా అవమానించారని ఆరోపిస్తూ స్థానిక హిందువులు శాంతియుత ఆందోళన నిర్వహించారు.

ఎంఎల్ఏ ప్రకటనపై అడ్వర్టైజర్స్ స్టాండర్డ్ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లలో ఆందోళన నిర్వహించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటనను తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లడ్డూలు పంచి నిరసన తెలిపారు.
Meat and Livestock Australia
lamb
Lord Ganesha
Hindus

More Telugu News