Hyderabad: పాతబస్తీలో 8 మంది అరబ్ షేకులు, 8 మంది బ్రోకర్లు అరెస్టు

  • హైదరాబాదులో కాంట్రాక్టు వివాహాల కోసం వచ్చిన అరబ్ షేకులు
  • పేదింటి పిల్లలతో పెళ్లిళ్లు కుదర్చిన బ్రోకర్లు
  • బ్రోకర్ల ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు
  • పోలీసుల అదుపులో అరబ్ షేకులు, బ్రోకర్లు
హైదరాబాదులోని పాతబస్తీలో 8 మంది అరబ్ షేకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ, చాంద్రాయణ గుట్టలో కాంట్రాక్టు మ్యారేజీల కోసం అరబ్ షేకులు వచ్చారన్న సమాచారంతో బ్రోకర్ల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు మ్యారేజీలకు సిద్ధంగా ఉన్న అరబ్ షేకులపై ఆరాతీసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన 8 మంది బ్రోకర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. వీరంతా పేదంటి మైనర్లపై కన్నేసి, వారిని మభ్యపెట్టి వివాహాలు కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
Hyderabad
patabasti
Chandrayanagutta
contract marriages
Arub shaiks

More Telugu News