Elephants attack on School: తమిళనాడులో పాఠశాలపై ఏనుగుల గుంపు దాడి

తమిళనాడులోని కోయంబత్తూరు శివారులోని ఓ ప్రయివేటు పాఠశాలపై ఏనుగుల గుంపు దాడిచేసింది. మొత్తం ఐదు ఏనుగులు పాఠశాల కాంపౌండ్ గోడను కూల్చి లోపలికి ప్రవేశించినట్లు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కనిపించింది. అదృష్టవశాత్తు పాఠశాలలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, అధికారులు పాఠశాలకు వచ్చేసరికి ఏనుగులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇటీవల ఎండలు బాగా మండిపోతుండటంతో అడవుల్లో నీరు దొరక్క ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News