panner selvam: తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తాం: తన మద్దతుదారులతో భేటీ అనంతరం ప‌న్నీర్ సెల్వం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కావాల‌ని పావులు క‌దుపుతున్న అన్నాడీఎంకే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌పై తిరుగుబాటు చేస్తున్న ప‌న్నీర్ సెల్వం ఈ రోజు సాయంత్రం మ‌రోసారి తన మ‌ద్ద‌తుదారుల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఎవ‌రి హ‌స్త‌గ‌తం కాబోదని, తాము తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తామ‌ని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీని శ‌శిక‌ళ‌ కుటుంబ ఆస్తిగా మార్చుతున్నార‌ని, త‌మ పార్టీని ఎవ్వ‌రూ స్వాధీనం చేసుకోలేర‌ని ఉద్ఘాటించారు. త‌మ పార్టీలో కుటుంబ రాజ‌కీయాల‌కు తావు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News