ఎయిర్‌పోర్టుకి బయలుదేరిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తన నివాసంలో అధికారులు, అన్నాడీఎంకే నేతలతో భేటీ అవుతూ కీలక చర్చలు జరుపుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెన్నై ఎయిర్‌పోర్టుకి బయలుదేరారు. మహారాష్ట్రలోని ముంబయి రాజ్‌భవన్ నుంచి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి బయలుదేరిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని బయలుదేరారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన గవర్నర్‌ను కలవనున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, నేతలు ఉన్నట్లు సమాచారం.