panner selvam: ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల వెనుక ఓ శ‌క్తి ఉంది: పన్నీర్ సెల్వం తాజా వ్యాఖ్యలు

తాను నోరు విప్పితే అందరి జాతకాలు బయటపడతాయంటూ త‌న తీరుకి విభిన్నంగా వ్యాఖ్య‌లు చేసి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను మరింత వేడెక్కించిన ఆ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం తాజాగా మ‌రోసారి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల వెనుక ఓ శ‌క్తి ఉందని అన్నారు. అలాగే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న షీలా బాల‌కృష్ణ‌న్ రాజీనామాపై తాను ఇప్పుడు ఎక్కువ‌గా మాట్లాడ‌బోన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర‌లు జ‌రిపితే ప‌లు నిజాలు బ‌య‌టపెడ‌తాన‌నే సంకేతాలు ఇస్తూ ప‌న్నీర్ సెల్వం మ‌రింత ఉత్కంఠ పెంచుతున్నారు. మ‌రోవైపు ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ప‌న్నీర్ సెల్వం నివాసానికి వ‌చ్చిన ఎంపీ మైత్రేయ‌న్ ఆయ‌నకు మ‌ద్దతు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News