flipcart: మూడు రోజుల పాటు ఫ్లిప్కార్ట్ లో అద్భుత ఆఫర్లు.. భారీ తగ్గింపులతో అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవిగో!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మూడు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ప్రకటించిన భారీ ఆఫ‌ర్లు నిన్నటితో ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆన్‌లైన్ విక్రయాల మ‌రో దిగ్గ‌జ‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్ల‌తో రేప‌టినుంచి త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోనుంది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో రేప‌టి నుంచి ఈ నెల‌ 26 మధ్య ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంద‌ని ఈ సంస్థ పేర్కొంది. ఈ డిస్కౌంట్‌లో భాగంగా శాంసంగ్, లెనోవా, సోనీ, రెడ్ మీ లాంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. అంతేగాక‌, ఎక్చేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్‌లో టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు లాంటి ఎన్నో వ‌స్తువుల‌ను అందిస్తుంది. ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళితే ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న వ‌స్తువులు, వాటి ఆఫ‌ర్ల పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్న‌ట్లు, ఈ న‌గ‌దును త‌మ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 30 తరువాత క్రెడిట్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఆఫ‌ర్ల‌లో స్మార్ట్ ఫోన్లపై అందిస్తున్న‌ డిస్కౌంట్ల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే... రూ.18, 490 ధ‌ర ఉన్న శామ్‌సంగ్‌ గెలాక్సీ (గోల్డ్, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌ను రూ. 16, 900కే పొంద‌వ‌చ్చు. ఇక 13, 499 లెనోవా వైబ్ కే 5 నోట్ (గ్రే 32 జీబీ ) 4జీబీ ర్యాంను రూ.11,499కు పొంద‌వ‌చ్చు. రూ.15,900 శామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8 (బంగారు 16 జీబీ)ను రూ 14, 900 కి సొంతం చేసుకోవ‌చ్చు. రూ.42, 998 ధ‌ర ఉన్న‌ నెక్సస్ 6సీ స్పెషల్ ఎడిషన్ (గోల్డ్ 64 జీబీ) డిస్కౌంట్ ధర రూ .35, 998కే పొంద‌వ‌చ్చు. ధర రూ.24, 999గా ఉన్న‌ ఎంఐ 5 (వైట్, 32 జీబీ) ఫ్లిప్ కార్ట్‌లో రూ.22, 999కే లభిస్తుంది.
  • Loading...

More Telugu News