panner selvam: ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. ఇటీవ‌లే ఐటీ అధికారులు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం స‌భ్యుడిగా ఉన్న శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో భారీగా న‌గ‌దు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న క్ర‌మంలో ఐటీ అధికారుల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్మోహ‌న్ రావుకు సంబంధించి ప‌లు ఆస్తుల గురించి తెలిసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌నకు స‌బంధించిన ఆస్తుల‌పై విస్తృతంగా త‌నిఖీలు కొనసాగుతున్నాయి. మ‌రోవైపు అన్నాడీఎంకే ప్ర‌భుత్వంపై ఆ రాష్ట్ర‌ ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం ఆ రాష్ట్ర స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రుల‌తో ఆయ‌న‌ చ‌ర్చిస్తున్నారు. త‌మ‌ తదుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News