traffic jam: కారులో చెల‌రేగిన మంట‌లు... హైద‌రాబాద్ తార్నాక వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జాం


హైద‌రాబాద్‌లోని మెట్టుగూడ వ‌ద్ద ఈ రోజు ఉద‌యం ఓ కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ర‌హ‌దారి వ‌ద్ద ఉన్న ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కారులో మంట‌లార్పుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డి ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. మెట్టుగూడ నుంచి తార్నాక వ‌ర‌కు (సుమారు 2 కిలో మీట‌ర్లు) వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News