భారతదేశంలోని 12 క్యాంపస్‌లలో ప్రైడ్ వాక్‌ నిర్వహించిన జీఈ

Related image

బెంగళూరు, బుధవారం, 7 జూన్ 2023: ప్రైడ్ నెలను పురస్కరించుకుని, LGBTQIA కమ్యూనిటీకి తన మద్దతు ను అందించడానికి, జీఈ భారతదేశంలోని తన క్యాంపస్‌లలో 12 ప్రైడ్ వాక్‌లను నిర్వహించింది. ఈ వాక్ లలో 1600 కంటే ఎక్కువ కి పైగా జీఈ ఉద్యోగులు, మిత్రులు, కమ్యూనిటీ సభ్యులు బలమైన సంఘీభావ ప్రదర్శనలో చు రుగ్గా పాల్గొన్నారు. ప్రైడ్ వాక్‌లు ఈ సంవత్సరం పెద్ద ప్రభావంతో తిరిగి వచ్చాయి. బెంగుళూరు, హైదరాబాద్, పు ణె, హోసూర్, పల్లవరం, దబాస్‌పేట్, పడప్పాయి, వడోదరలోని మూడు ప్రదేశాలు, నోయిడాలోని రెండు ప్రదేశాలలో ఉ న్న వివిధ జీఈ క్యాంపస్‌లలో ఇవి నిర్వహించబడ్డాయి. 2022లో, 1500 మంది జీఈ ఉద్యోగులు,  మిత్రులు 10 వే దికల వద్ద ఈ వాక్‌లలో పాల్గొన్నారు.


ప్రైడ్ వాక్‌లను పురస్కరించుకుని, జీఈ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ మహేష్ పలాషికర్ మాట్లాడుతూ, ‘‘జీఈలో భాగమైనందుకు, ప్రైడ్ నెలను వేడుక చేసుకునేందుకు మా ఉద్యోగులు ఏకం అవుతున్నప్పుడు వారి సామూహిక స్ఫూర్తికి సాక్ష్యంగా నిలవడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. జీఈలో మేం ఇ న్నోవేషన్, ఇన్‌క్లూజన్ మధ్య సంక్లిష్టమైన సహసంబంధాన్ని గుర్తించాం. ఇన్నోవేషన్ లీడర్‌గా, మేం వైవి ధ్యం, ఈక్విటీ అనే వాటిని నేర్చుకోవడం, సహకారం, శ్రేయస్సులకు కీలక మీటలుగా వేడుక చేసుకుంటాం. LGBTQIA క మ్యూనిటీ చేరిక, ఏకీకరణకు సంబంధించి గత 18 నెలల్లో జీఈకి చెందిన ప్రైడ్ అలయన్స్ దక్షిణాసియాలో సంభాషణలకు నాయకత్వం వహిస్తోంది. అవగాహన పెంచడానికి గ్రౌండ్‌వర్క్‌ ను నిర్వహి స్తోంది.  సానుకూల మార్పును ప్రచారం చేయడానికి మా ప్రైడ్ అలయన్స్ నేతృత్వం లోని ఈ అనేక కార్యక్రమాలకు పొడిగింపు ఈ ప్రైడ్ వాక్‌లు’’ అని అన్నారు.


ఈ సందర్భంగా జీఈ సౌత్ ఏషియా  సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్, లైసెన్సింగ్, ఇన్‌క్లూజన్,  డైవర్సిటీ లీడ ర్,  శుక్లా చంద్ర మాట్లాడుతూ, ‘‘జీఈ అంతటా, మా ప్రైడ్ అలయన్స్ మా వర్క్‌ ఫోర్స్‌ లో ఐక్యతను పెంపొం దించడానికి, గొప్ప వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడానికి అంకితం చేయబడింది. వైవిధ్యం, చేరికలను పెంపొం దించడానికి దక్షిణాసియాలో చురుకుగా పని చేస్తున్న మూడు ఉద్యోగ వనరుల సమూహాల (ERGలు) లో ప్రైడ్ అలయన్స్ ఒకటి. ఇప్పుడు ఈ కూటమిలో 300 మంది మిత్రులు ఉన్నారు, వారు ఈ విషయం లో అవగాహన కల్పించడం ద్వారా కార్యాలయ సమ్మేళనాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. ప్రతి వ్యక్తి విలువైన, గౌరవంగా భావించే సమ్మిళిత, స్వాగతించే వాతావరణాన్ని పెంపొందించడం మాకెంతో గర్వకారణం’’ అని అన్నారు.


వ్యక్తుల గుర్తింపుతో సంబంధం లేకుండా వారికి సాధికారత, గౌరవాన్ని అందించేందుకు జీఈ ప్రాధాన్యతని స్తుంది. ప్రైడ్ నెల అనేది కేవలం వేడుక చేసుకోవడానికి మాత్రమే కాకుండా, ముఖ్యంగా LGBTQIA కమ్యూనిటీ అందించిన సహకారాలను గౌరవించడానికి, దాని పోరాటాలను పంచుకోవడానికి ఒక అవకా శం. జూన్ నెల అంతటా జీఈ ఈ అవగాహన ను వ్యాప్తి చేయడానికి, సంభాషణలను ప్రేరేపించడానికి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్కిట్ పోటీలు, వాల్ ఆర్ట్ ప్రాజెక్ట్‌ లు, సెల్ఫ్-ఐడీ ప్రచారం, ప్రొనౌన్స్ క్యాంపె యిన్, సరఫరాదారుల సెన్సిటైజేషన్, ఇంకా  మరెన్నో కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉద్యోగులు ఆహ్వా నించబడతారు.


ప్రత్యేకించి, జీఈ ఎల్ఎం విండ్ పవర్ బిజినెస్ ఈ విషయంలో మార్గదర్శక పాత్రను పోషిస్తోంది. ప్రైడ్ మార్చ్‌ లు భారతదేశంలో మొదట ఎల్ఎం విండ్ పవర్ ద్వారా రూపొందించబడ్డాయి. ఇప్పుడు అవి సంస్థకు సంబంధించిన అన్ని గ్లోబల్ సెంటర్‌లలో జరుగుతున్నాయి. వాస్తవానికి, అన్ని జీఈ వ్యాపారాలు తమ వ్యక్తిగత దృక్పథాలు, వైవిధ్యం, చేరిక కోసం చర్యలతో ప్రైడ్ నెలను వేడుక చేసుకోవడానికి కలిసి వస్తున్నా యి. అదనంగా, అనేక హబ్‌లు ఏడాది పొడవునా సమానత్వ సందేశాన్ని ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఛాంపియన్ మిత్రులను గుర్తించి అభినందిస్తాయి. అన్ని కార్యకలాపాలు వ్యక్తిత్వాన్ని వేడుక చేసుకునే, విజయాన్ని పెంపొందించే విభిన్నమైన, సమ్మిళిత కార్యాలయాన్ని సృష్టించే జీఈ లక్ష్యంతో ముగుస్తాయి.


తన ప్రైడ్ అలయన్స్‌తో లింగ సానుకూలతను పెంపొందించడానికి, సమ్మిళిత కార్యస్థలాన్ని రూపొందించ డానికి అనేక రకాల కార్యక్రమాలకు జీఈ నాయకత్వం వహిస్తోంది.  విధానాలు, ఆచరణలు, మౌలిక సదు పాయాలు, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయడం ద్వారా చేరిక, వైవిధ్యం, ఈక్విటీని జీఈ ప్రైడ్ అల యన్స్ కమ్యూనిటీ  ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం, LGBTQIA కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి జీఈ కింది కార్యక్రమాలను కలిగి ఉంది:

 
·       ఫోకస్డ్ జాబ్ ఫెయిర్‌లు, విజయవంతమైన జాబ్ ఆఫర్‌ల ద్వారా LGBTQIA కమ్యూనిటీకి సకారా త్మకంగా జీఈ మద్దతు ఇస్తోంది.

·       సెన్సిటైజేషన్, అవగాహన కల్పించడం, స్నేహపూర్వక ఆన్ బోర్డింగ్ సెషన్‌లు క్రమం తప్పకుండా వ్యక్తి గత, వర్చువల్ ఫార్మాట్‌లో నిర్వహించబడతాయి. ఈ సెషన్‌లు సీనియర్ నాయకత్వం, పీపుల్ లీడర్‌ లు, మానవ వనరుల బృందానికి శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టితో ఉద్యోగులందరినీ కవర్ చేస్తాయి. ఈ సెషన్‌లు విక్రేత భాగస్వాములకు కూడా విస్తరించబడ్డాయి.

·       ఆధారపడినవారిగా స్వలింగ భాగస్వాములకు వైద్య బీమా వర్తిస్తుంది.

·       జీఈ లోని ట్రాన్స్‌ జెండర్ ఉద్యోగుల రక్షణ విధానం తగిన సౌకర్యాలు, సదుపాయాలను నిర్ధారిస్తుంది.

·       ఇన్ క్లూజివి రీలొకేషన్ విధానాన్ని జీఈ  ప్రోత్సహిస్తుంది.

·       జీఈ కేంద్రాలలో జెండర్ న్యూట్రల్ వాష్‌రూమ్ అందుబాటులో ఉంది.

·       అనుబంధ నెట్‌వర్క్‌ లు, ప్రత్యేక ఉద్యోగుల సహాయ ప్రోగ్రామ్ మద్దతును జీఈ అందిస్తుంది.

·       జీఈ అనేది సమాన అవకాశాలు అందించే యజమాన్యం. జాతి, రంగు, మతం, జాతీయ లేదా జాతి మూలం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు లేదా వ్యక్తీకరణ, వయస్సు, వైకల్యం, రక్షిత అనుభవ జ్ఞుల స్థితి లేదా చట్టం ద్వారా రక్షించబడిన ఇతర లక్షణాలతో సంబంధం లేకుండా ఉద్యోగ నిర్ణయాలు తీసుకోబడతాయి.

దక్షిణాసియాలో జీఈ

జీఈ 1902 నుండి దక్షిణాసియాలో పనిచేస్తోంది. నేడు, దాని 14,000 మంది ఉద్యోగులు ఇక్కడ పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి రూపకల్పన, తయారీ, ప్రాజెక్ట్ అమలు, సేవలలో పని చేస్తున్నారు. దశాబ్దాలుగా జీఈ  స్థానిక జాయింట్ వెంచర్ భాగస్వాములు, కస్టమర్‌లు, సరఫరాదారులతో లోతైన భాగస్వామ్యాన్ని నిర్మిం చింది. భారతదేశంలోని జీఈ భాగస్వాములు, కస్టమర్‌లలో ప్రభుత్వ సంస్థలు, పెద్ద భారతీయ సంస్థలు, అలాగే చిన్న, మధ్య తరహా కంపెనీలు ఉన్నాయి.

More Press Releases