సికింద్రాబాద్ కిమ్స్‌లో ప్ర‌త్యేకంగా ఐబీడీ క్లినిక్

Related image

* ఆరోగ్య సేవ‌ల్లో క‌చ్చిత‌త్వానికి ఇదో నిద‌ర్శ‌నం

* అంత‌ర్జాతీయ స్థాయి చికిత్సకు ప్ర‌త్యేక‌  శిక్ష‌ణ‌

* కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ డాక్ట‌ర్ భాస్క‌ర్ రావు

 
హైద‌రాబాద్‌, మే 27, 2023: రోగుల‌కు సేవ‌లు అందించ‌డంలో కిమ్స్ ఆస్ప‌త్రి మ‌రో ముంద‌డుగు వేసింది. ప్ర‌త్యేకంగా ఇన్‌ఫ్ల‌మేట‌రీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ) కోసం ఒక స్పెషాలిటీ క్లినిక్‌ను శ‌నివారం ప్రారంభించింది. ఒలింప‌స్ ఎక్స్1 ఎండోస్కోప్‌లు, స్పైర‌స్ ఎంటెరోస్కోప్‌ల లాంటి అత్యాధునిక‌, అత్యుత్త‌మ నాణ్య‌త క‌లిగిన ప‌రిక‌రాల‌ను ఈ క్లినిక్ కోసం ప్ర‌త్యేకంగా తెప్పించామ‌ని, దాంతోపాటు ఐబీడీ చికిత్సా ప‌ద్ధ‌తుల‌లో ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగ‌ఢ్‌లోని పీజీఐఎంఈఆర్ లాంటి ప్ర‌ఖ్యాత సంస్థ‌ల్లో ప్ర‌త్యేకంగా త‌మ వైద్యుల‌కు శిక్ష‌ణ ఇప్పించామ‌ని ఈ విభాగం ప్రారంభం సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ డాక్ట‌ర్ బి.భాస్క‌ర్‌రావు తెలిపారు.

 
ఈ వ్యాధి గురించి, ఇందుకు ఆస్ప‌త్రిలో అందించే చికిత్స గురించి ఆయ‌న మాట్లాడుతూ, ‘‘ఇన్‌ఫ్ల‌మేట‌రీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ) అనేది జీర్ణ‌కోశం.. అంటే ముఖ్యంగా పెద్ద‌పేగు, చిన్న పేగుల‌ను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధుల‌కు సంబంధించిన పదం. ఇందులో క్రాన్స్ డిసీజ్‌, అల్స‌రేటివ్ కొలైటిస్ లాంటి ప‌రిస్థితులు ఉంటాయి. ఇవి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బాధితుల‌ జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. గ‌త కొన్నేళ్లుగా ఐబీడీ మ‌న దేశంలో పెరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందికి వ‌స్తోంది. 2010 నాటికి భారతదేశంలో దాదాపు 14 లక్ష‌ల మంది దీంతో బాధ‌ప‌డుతున్నారు. అమెరికాలో సుమారు 16 ల‌క్ష‌ల మంది బాధితులున్న‌ట్లు అంచ‌నా.
 
అవ‌గాహ‌న ద్వారానే ఈ వ్యాధిని నియంత్రించ‌గ‌ల‌మ‌న్న‌ది మా ఉద్దేశం. ఈ వ్యాధి ప్రారంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు, స‌రైన స‌మ‌యానికి చికిత్స అందిస్తే వ‌చ్చే ఫ‌లితాల గురించి రోగుల‌తో పాటు వైద్యవ‌ర్గాల‌కూ అవ‌గాహ‌న పెంచాల‌న్న‌దే మా ల‌క్ష్యం. కమ్యూనిటీ ఔట్ రీచ్ కార్యక్రమాలు, ప్రచారాలు, పేషెంట్ ఎడ్వొక‌సీ గ్రూపుల సహకారంతో, మేము క‌చ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఐబీడీ గురించిన అపోహ‌ల‌ను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఐబీడీకి ప‌లు విభాగాల్లో స‌మ‌గ్ర చికిత్స అవ‌స‌రం. ఇందులో గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, సర్జన్లు, డైటీషియన్లు, సైకాల‌జిస్టులు, నర్సులతో సహా నిపుణుల బృందం ఉంటుంది. ఈ నిపుణుల మధ్య సహకారం, కమ్యూనికేషన్ ను పెంపొందించడం ద్వారా, రోగుల అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ సంరక్షణను పొందేలా మేము నిర్ధారించవచ్చు’’ అని డాక్ట‌ర్ భాస్క‌ర్ రావు చెప్పారు.
 

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్‌ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లు డాక్ట‌ర్‌ శ్రీకాంత్ అప్పసాని మరియు డాక్టర్ భాస్కర్ కంటే మాట్లాడుతూ, ‘‘ఐబీడీ గురించిన అవ‌గాహ‌న‌ను మ‌రింత‌గా పెంచ‌డం, వినూత్న చికిత్సా విధానాల అభివృద్ధిలో ప‌రిశోధ‌న‌దే కీల‌క పాత్ర అన్న విష‌యాన్ని మేం గుర్తించాము. ఐబీడీ విష‌యంలో స‌హ‌కార ప‌రిశోధ‌న కార్య‌క‌లాపాలు, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనేందుకు అంగీక‌రించిన ఈనాటి కార్య‌క్ర‌మంలోని ముఖ్య అతిథులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ వినీత్ అహుజా, హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరికి ధన్యవాదాలు. చివరగా, ఐబీడీ లాంటి దీర్ఘ‌కాలిక వ్యాధి చికిత్స రోగులకు, వారి కుటుంబాలకు మానసికంగా కూడా ఓ పెద్ద స‌వాలు. అందువల్ల, మా చికిత్స‌లో ప్ర‌ధానంగా మానసిక మద్దతు, కౌన్సెలింగ్, సేవలు, పేషెంట్ స‌పోర్ట్ గ్రూపుల‌కూ ప్రాధాన్యం ఇస్తుంది. రోగుల మాన‌సిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో.. వారి జీవ‌న నాణ్య‌త‌ను మెరుగుపరచవచ్చు, త‌ద్వారా ఐబీడీలో వ‌చ్చే స‌వాళ్ల‌ను ఎదుర్కొనేలా వారిని శ‌క్తివంతం చేయొచ్చు’’ అని వివ‌రించారు.

More Press Releases