చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

Related image

“జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్”. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా హైదరాబాద్
నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్ తరాల బాగుకోసం, ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు.

నాకు తెలిసి భారత దేశ చరిత్రలో ఇంత భారీయెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిపట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటడం.. గౌరవ ముఖ్యమంత్రిగారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మానసపుత్రిక “హరిత హారానికి” మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, నా పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గోనే అవకాశం కల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆద్యులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    
ప్రతీ ఒక్కరు “హరిత హారం”లో అదే విధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్యా దవ్, హెచ్ ఎం డీ ఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases