Gautam Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన ఘటనను చూడాలని ఎవరూ అనుకోరు.. అయినా గంభీర్ ఇప్పుడేమీ ఆడట్లేదు కదా: షేన్ వాట్సన్

shane watson clear take on virat kohli vs gautam gambhir spat in ipl 2023

  • క్రికెటర్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు మైదానంతోనే ఆగిపోవాలన్న షేన్ వాట్సన్
  • గ్రౌండ్ లో ఉన్నప్పుడు గెలుపు కోసం పోరాడాలని వ్యాఖ్య 
  • మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నింటినీ వదిలేయాలని సూచన

ఇటీవల ఐపీఎల్ లో బెంగళూరు, లక్నో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వారిద్దరి తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ దూకుడు సరికాదని కొందరు, మైదానంలో కోచింగ్ స్టాఫ్ కు ఏం పని? అని గంభీర్ ను మరికొందరు తప్పుపడుతున్నారు. 

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహాయక కోచ్ షేన్ వాట్సన్ ఈ వ్యవహారంపై స్పందించాడు. రాయల్ చాలెంజర్స్ జట్టుతో ఢిల్లీ తలపడనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ ఆడటం లేదని, అలాంటప్పుడు గొడవలకు దూరంగా ఉంటే మంచిదని హితవు పలికాడు. 

‘‘మైదానంలో ఉన్నప్పుడు గెలుపు కోసం పోరాడాలి. ఎలాంటి వాగ్వాదమైనా, గొడవలైనా అక్కడితోనే ఆగిపోవాలి. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడానికి సరైన వేదిక మైదానమే. మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నింటినీ వదిలేయాలి’’ అని వాట్సన్ సూచించాడు. 

‘‘కోహ్లీ, గంభీర్ మధ్య జరిగినటువంటి ఘటనలను చూడాలని ఎవరూ అనుకోరు. గంభీర్ ఆడట్లేదు కదా.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బాగుండేది’’ అని సూచించాడు. మొన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కోచింగ్ స్టాఫ్ కు గ్రౌండ్ లో ఏం పని అన్నట్లుగా విమర్శలు చేశాడు.

Gautam Gambhir
Virat Kohli
shane watson
ipl 2023
kohli vs gambhir
  • Loading...

More Telugu News