హనుమంతుని నవ అవతారాలు

హనుమంతుడిని స్మరించినంత మాత్రాన్నే బుద్ధి .. బలం .. యశస్సు .. ధైర్యం .. నిర్భయత్వం .. ఆరోగ్యం .. చైతన్యం .. వాక్పటిమ కలుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి హనుమంతుడు రామాలయాలలోను .. ఉపలయాలలోను .. ప్రధాన దైవంగాను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన నవ అవతారాలను ధరించాడు.

ప్రసన్నాంజనేయస్వామిగా .. వీరాంజనేయస్వామిగా .. వింశతి భుజాంజనేయ స్వామిగా .. పంచముఖాంజనేయ స్వామిగా .. అష్టాదశ భుజాంజనేయ స్వామిగా .. సువర్చల సహిత ఆంజనేయస్వామిగా .. చతుర్భుజాంజనేయస్వామిగా .. ద్వాత్రింశద్భుజాంజనేయస్వామిగా .. వానరాంజనేయస్వామిగా ఆయన ఆయా క్షేత్రాల్లో కొలువై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. సకల దేవతల అనుగ్రహం ఆంజనేయస్వామికి ఉండేలా బ్రహ్మదేవుడి వరం వుంది. అందువలన హనుమంతుడిని పూజించడం వలన, సకల దేవతల అనుగ్రహం లభిస్తుందనేది పెద్దల మాట.


More Bhakti News