ఇలాంటివారిపట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట

లక్ష్మీదేవి .. పార్వతీదేవి .. సరస్వతీదేవిలను త్రిమాతలుగా భక్తులు కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరి సంపదలను ప్రసాదిస్తుంది .. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది .. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తూ, పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

జీవితంలో చాలామంది సిరి సంపదలను కోరుకుంటారు. సిరి సంపదలతో వచ్చే భోగభాగ్యాలను అనుభవించాలని ఆశిస్తారు. అందువల్లనే లక్ష్మిదేవి అనుగ్రహం తమ పట్ల ఉండాలని ఆ తల్లికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే లక్ష్మీదేవి మాత్రం తనకి ప్రీతికరమైన వారిపైనే అనుగ్రహం చూపుతుందట. ఎవరైతే తమ ఇంటిని పవిత్రంగా .. శుభ్రంగా ఉంచుతారో .. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటారో .. నిస్వార్థంతో వ్యవహరిస్తుంటారో .. అసత్యం పలకరో .. అహంభావానికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులను .. గురువులను పూజిస్తారో, అలాంటి వారి ఇంట ఉండటానికీ .. అలాంటివారిని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉంటుందనేది మహర్షుల మాట.


More Bhakti News