ఇలా చేస్తే శనిదేవుడు శాంతిస్తాడట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలా చేస్తే శనిదేవుడు శాంతిస్తాడట

శని దోషం ఉందని ఎవరైనా చెప్పగానే అవతలివారు భయపడిపోతారు. ఇక తమకి అష్టకష్టాలు ..బాధలు తప్పవనుకుని కంగారు పడిపోతారు. శని దోషం కారణంగా ఎలాంటి ఆపదలు ఎటువైపు నుంచి ముంచుకొస్తాయోనని ఆందోళన చెందుతారు. శని దేవుడు ప్రీతి చెందడానికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతూ, ఆ దోషం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటారు.

శని దేవుడు ప్రీతి చెందేలా చేయడానికి అనేక ఉపాయాలు వున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి సులువైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. శని దేవుడికి నలుపు రంగు ప్రీతికరమైనదనీ .. ఆయన వాహనం 'కాకి' అనే విషయం తెలిసిందే. అలాంటి కాకులకు తీపి పదార్థాలను ఆహారంగా ఇవ్వాలి. అలాగే నల్ల చీమలు ఎక్కడ వున్నా వాటికి ఆహారంగా పంచదార వేయాలి. నల్ల కుక్కలకు .. నల్ల ఆవులకు ఆహారాన్ని అందించాలి. ఈ విధంగా చేయడం వలన, నిస్సహాయులపట్ల జాలి .. దయ .. ప్రేమ కలిగి ఉండటం వలన శని దేవుడు ప్రీతి చెందుతాడు. ఆయన శాంతిస్తే ఆ దోషం ప్రభావం తగ్గుతూ పోతుందనేది శాస్త్రం తెలిసిన పెద్దల మాట.

More Bhakti Articles