ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఇలా తొలగుతాయట

జీవితమన్న తరువాత ఎన్నో కష్టాలు .. మరెన్నో బాధలు ఉంటూనే ఉంటాయి. వివిధ రకాల సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇబ్బందులు ఎన్ని వున్నప్పటికీ వాటిని ఎలాగో అలా తట్టుకోవచ్చు. కానీ ఆర్థికపరమైన ఇబ్బంది అన్ని ఇబ్బందుల్లోకి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అత్యవసరాల్లో .. ఆపదల్లో  వున్నప్పుడు ఆర్థికపరమైన సమస్య మరింత ఆందోళనకి గురిచేస్తుంది.

అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంటి ప్రవేశ ద్వారం పైభాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్నిగానీ .. చిత్రపటాన్నిగాని ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం కారణంగా ప్రతికూలతలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం ద్వారానికి మామిడి తోరణాలను కట్టడం వలన, అమ్మవారిని ప్రతి శుక్రవారం గులాబీలతో పూజించడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.


More Bhakti News