రామలక్ష్మణుల కారణంగా ఏర్పడిన జంట క్షేత్రాలు

రావణ సంహారం అనంతరం ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి శ్రీరాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లారు. ఈ కారణంగానే కొన్ని ప్రాచీన క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఒక ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం .. ఆ రెండు క్షేత్రాలు పక్కపక్కనే వెలుగొందుతుండటం విశేషం.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. ఒక క్షేత్రం 'ఊడిమూడి' అయితే మరో క్షేత్రం బెల్లంపూడి. ఊడిమూడిలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం వుంది. అక్కడికి దగ్గరలోనే గల 'బెల్లంపూడి'లో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం వుంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం 'రామలింగేశ్వరుడు'గా .. లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం 'లక్ష్మణేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాయి. ఇలా రామలక్ష్మణులు ప్రతిష్ఠించిన శివలింగాలు జంట క్షేత్రాలుగా పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. బెల్లంపూడిలో శ్రీరామచంద్రుడు స్వయంభువుగా ఆవిర్భవించడం మరో విశేషం. 


More Bhakti News